![Telangana Minister Harish Rao Appreciate CM KCR - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/7/HARISH-RAO.jpg.webp?itok=2QoGUoxA)
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మానవతామూర్తి అని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. డయాలసిస్ రోగులకు ప్రభుత్వం ఇప్పటికే ఉచిత డయాలసిస్‌తో పాటు బస్‌పాస్ అందిస్తోందని, దీంతోపాటు ఆసరా పెన్షన్ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం ఆయన మానవత్వానికి నిదర్శనమని ప్రశంసించారు.
ముఖ్యమంత్రి నిర్ణయంపై తెలంగాణ బోధన ప్రభుత్వ వైద్యుల సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ కిరణ్ మాదల, సెక్రటరీ జనరల్ డాక్టర్ జలగం తిరుపతిరావు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ రవూఫ్, ట్రెజరర్ కృష్ణప్రసాద్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment