
రైతు గోస ధర్నాలో మాట్లాడుతున్న షర్మిల
సుజాతనగర్: దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో వ్యవసాయం పండుగలా మారితే, ప్రస్తుత సీఎం కేసీఆర్ హయాంలో రైతులంతా అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో సాగింది. ఈ సందర్భంగా సుజాతనగర్‌లో ఏర్పాటు చేసిన రైతుగోస ధర్నాలో షర్మిల మాట్లాడారు.
రైతులను కోటీశ్వరులను చేశామని సీఎం అంటున్నారని, అంత ధనవంతులైతే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. రుణమాఫీ కోసం 36 లక్షల మంది ఎదురుచూస్తున్నారని, గత ఏడేళ్లలో 7 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. యాసంగిలో వరి వేయొద్దని చెబితే 17 లక్షల ఎకరాల్లో రైతులు పంట సాగు చేయలేదని, వరి పండించని రైతులకు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment