సాక్షి, హైదరాబాద్: అంకితభావంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఆరేళ్లుగా పనిచేస్తున్నామని, గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఎంత అంకితభావంతో పనిచేశామో ఇప్పుడూ అదే స్ఫూర్తితో కాంగ్రెస్‌లో పనిచేస్తున్నామని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.
బుధవారం ‘సాక్షి’ పత్రికలో ‘సొంత గూటికి ఎల్లో కాంగ్రెస్’ శీర్షికన ప్రచురితమైన కథనంపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు స్పందించారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో పటేల్ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ తాము టీడీపీ నుంచి అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌లోకి వెళ్లలేదని, ప్రజాసమస్య లపై పోరాడాలనే దృక్పథంతో ప్రతిపక్ష పార్టీ అయి న కాంగ్రెస్‌లో చేరామన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశా రు. తమను వలస నేతలుగా చిత్రీకరించడం బాధి స్తోందని చారుకొండ వెంకటేశ్ చెప్పారు. తాము టీడీపీని వీడిన తర్వాత బాబుతో కానీ, ఆయన మనుషులతో కానీ మాట్లాడినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని జంగయ్య యాదవ్ అన్నారు.
చదవండి: సర్దుకుపోదాం రండి!.. టీపీసీసీ నేతలతో దిగ్విజయ్ భేటీ
Comments
Please login to add a commentAdd a comment