సాక్షి, న్యూఢిల్లీ: మరికొన్ని రోజుల్లోనే రాష్ట్రానికి పట్టిన చీడ విరగడ కాబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో ఇప్పటికే కేసీఆర్‌కు చలిజ్వరం పట్టిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడనుండటంతో ఇకపై ఆయన ఫాంహౌస్ నుంచి బయటకు రావాల్సిన అవసరం లేదన్నారు. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్, బీజేపీ కుట్రలను తిప్పి కొట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఆయన పిలు పునిచ్చారు. ఎన్ని కల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
చర్చకు సిద్ధమా?
రాబోయే విజయదశమిని తెలంగాణ ప్రజలు ఉత్సాహంగా జరుపుకోవాలని రేవంత్‌రెడ్డి సూచించారు. అధికారం కోల్పోతున్నామన్న భయం బిల్లా–రంగాలలో మొదలైందని విమర్శించారు. అందుకే ఏ స్థాయి లేకపోయినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీని విమర్శిస్తున్నా రని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలతో పాటు బీఆర్‌ఎస్ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు అందించిన పాల నపై అమర వీరుల స్తూపం వద్ద చర్చకు రావాలంటూ ఆయన సవాల్ విసిరారు.
రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ కుటుంబం రూ. లక్ష కోట్లు దోచుకుందని, 10 వేల ఎకరాల భూము లను ఆక్రమించుకుందని రేవంత్ ఆరోపించారు. అమరవీరుల స్తూపం, సచివాలయ నిర్మాణంలో కూడా దోపిడీకి పాల్పడ్డారని దుయ్యబట్టారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్నారని... దీన్ని ప్రజలు తిప్పికొట్టా ల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
అక్బరుద్దీన్, అసదుద్దీన్‌కు ఎందుకు అసహనం?
తాము బీజేపీ, బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తుంటే ఎంఐఎం నేతలైన అక్బరుద్దీన్, అసదుద్దీన్‌లు ఎందుకు అసహనం చెందుతున్నారో అర్థంకావట్లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. వారు ఎవరి పక్షాన నిలబడ్డారో, ఎవరికి మద్దతుగా నిలుస్తారో ఇప్పటికైనా తేల్చు కోవాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ, బీఆరెస్ కుట్రలు చేస్తున్నా యని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment