సభ్యసమాజం తలదించుకునేలా సంజయ్‌ మాటలు  | TRS MLA Chanti Kranthi Kiran Slams On BJP Chief Bandi Sanjay | Sakshi
Sakshi News home page

సభ్యసమాజం తలదించుకునేలా సంజయ్‌ మాటలు 

Published Sat, Aug 20 2022 12:49 AM | Last Updated on Sat, Aug 20 2022 12:49 AM

TRS MLA Chanti Kranthi Kiran Slams On BJP Chief Bandi Sanjay - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీలో తిరుగుబా ట్లు, అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఫ్రస్ట్రేషన్‌ ఎక్కువైందని, ఆయన మాటలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని టీఆర్‌ఎస్‌ ఆందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంజయ్‌కు తెలియకుండానే పార్టీలో చేరికలు జరుగుతున్నాయని, అది తట్టుకోలేక తోచిన విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

తెలంగాణ కోసం బీజేపీ చేసిందేంటో సంజయ్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  గూండాలు, రౌడీల తరహాలో సంజయ్‌ మాట్లాడుతున్నారని, వారసత్వ రాజకీయాలు బీజేపీలో లేవా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ఎప్పుడు సభ పెట్టాలో రాజగోపాల్‌ రెడ్డి చెప్తారా? అని మండిపడ్డారు. మునుగోడు ప్రజల కోసం రాజగోపాల్‌ రాజీనామా చేయలేదని, బీజేపీలో చేరేందుకే ఆయన రాజీనామా చేశార న్నారు. రాజగోపాల్‌రెడ్డికి దమ్ముంటే బీజేపీని గెలిపించాలని సవాల్‌ విసిరారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement