
నిజామాబాద్: తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్)పై బోధన్ ఎమ్మెల్యే షకీల్ మండిపడ్డారు. మల్లన్న నోరు అదుపులో పెట్టుకోకపోతే మర్యాద దక్కదని హెచ్చరించారు. ఒక రాష్ట్ర మంత్రిని, ఆయన కొడుకును నోటికొచ్చినట్లు మాట్లాడటం ఎంతవరకు సంస్కారమని నిలదీశారు. ‘మల్లన్న పద్ధతి మార్చుకోకపోతే.. సీరియస్ గా స్పందించాల్సి ఉంటుంది. ఒక మంత్రిని తిడితే వాళ్లనెన్నుకున్న రాష్ట్ర ప్రజలను కూడా తిడుతున్నట్టేనన్న సోయి మల్లన్నకు లేకుండా పోయింది.
కేటీఆర్ కొడుకును మధ్యలోకి ఎందుకు తీసుకొస్తున్నావ్..?, బీజేపీ ఇదేనా నేర్పుతున్న క్రమశిక్షణ..?, ఇలాంటి వాళ్లనా పార్టీల్లో చేర్చుకునేది..?, ఎంపీ అరవింద్ జిల్లా అభివృద్ధికి ఒక్క పనైనా చేశావా? అని ప్రశ్నించారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న దీక్షను షకీల్ తప్పుబట్టారు. తెలంగాణలో దీక్ష చేస్తున్న బండి సంజయ్.. బీజేపీ పాలిత రాష్ట్రాలకు పోయి నిరుద్యోగ దీక్ష చేపడితే బాగుంటుందని చురకలంటించారు.
కేటీఆర్ కొడుకుపై తీన్మార్ మల్లన్న ట్వీట్ దుమారం.. చెప్పు దెబ్బలు తప్పవంటున్న బాల్క సుమన్
Comments
Please login to add a commentAdd a comment