
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ల మధ్య బుధవారం ట్వీట్స్ వార్ కొనసాగింది. ‘దేశంలో అత్యస్పంత సంపన్న సీఎం ‘క్లాస్ వార్’ గురించి మాట్లాడటం దౌర్భాగ్యం. రాష్ట్రానికి వైసీపీ పెట్టుబడులు ప్రవాహాన్ని తెచ్చింది కదా.. ఇక ఎవరికి కావాలి ఈ దావోస్.. మన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ఎప్పుడో నూడిల్స్ సెంటర్, టీ స్టాల్స్ ప్రారస్పంభించేశారు. సీఎం ‘క్లాస్ వార్’ అంటూ కామ్రేడ్ చారుమజుందార్, కామ్రేడ్ నాగిరెడ్డి, కామ్రేడ్ పుచ్చలపల్లి వంటి వారి గురించి మాట్లాడతారు. ఏమిటీ దౌర్భాగ్యం!’ అంటూ పవన్ వరుస ట్వీట్లు చేశారు. దీనికి మంత్రి అమర్‌నాథ్ ట్విట్టర్ ద్వారానే ప్రతి స్పస్పందించారు.
‘బాబూ నిత్య కళ్యాణ్.. చారూ మజుస్పందార్, పుచ్చలపల్లి లాంటి పెద్దపెద్ద పేర్లు ఎందుకుగానీ.. మీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, స్క్రీన్‌ప్లే.. అన్నీ ఒక్కడే కదా? ఆ నారా జమీందార్ జీవిత చరిత్ర చదువుకో! ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చదివే ప్రభుత్వ బడిలో ఇంగ్లిష్ మీడియం పెట్టడానికి వీల్లేదని.. అమరావతి భూముల్ని పేదలకు పంచితే సామాజిక అసమతౌల్యం వస్తుందని వాదిస్పంచిన బాబు బ్యాచ్‌ది క్లాస్ వార్ కాదా? ఇతర రాష్ట్రాల కంటే వేగస్పంగా 2022 ఆర్థిక సంవత్సరంలో ఏపీ జీఎస్‌డీపీ 11.43% ఎలా చేరుకుంది? తలసరి ఆదాయంలో 2019లో 18వ స్థానం నుంచి 2021లో 9వ స్థానానికి ఎలా ఎగబాకింది? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో వరుసగా మూడేళ్లు ఎలా అగ్రస్థానంలో నిలిచింది? ఇవి కేంద్ర గణాస్పంకాలు. మీ నిరాధార ఆరోపణలు, ప్రశ్నలతో మీరు రాష్ట్ర కృషిని కించపరుస్తున్నారా?’ అంటూ మంత్రి తన ట్వీట్లతో పవన్‌పై మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment