కరోనా బారిన మరో కేంద్ర మంత్రి | Union Education Minister Ramesh Pokhriyal Nishank tests positive forCOVID19 | Sakshi
Sakshi News home page

కరోనా బారిన మరో కేంద్ర మంత్రి

Published Wed, Apr 21 2021 4:31 PM | Last Updated on Wed, Apr 21 2021 5:19 PM

Union Education Minister Ramesh Pokhriyal Nishank tests positive forCOVID19 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో  రెండో దశలో వేగంగా వ్యాప్తిస్తూ  ప్రకంపనలు రేపుతున్న  క‌రోనా  వైరస్‌ మ‌హ‌మ్మారి  రాజకీయ ప్రముఖుల్లో కలకలం  రేపుతోంది. కోవిడ్‌-19 పాజిటివ్‌ నిర్దారణ అవుతున్న రాజ‌కీయ‌ నేతల జాబితా అంత‌కంత‌కే పెరుగుతోంది.  తాజాగా  కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ నిషాంక్ క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ట్విటర్ ద్వారా వెల్ల‌డించారు.  క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో తనకు పాజిటివ్‌గా తేలిందని తెలిపారు. వైద్యులు సూచనలమేరకు తాను  చికిత్స తీసుకుంటానన్నారు. అలాగే ఇటీవ‌లి కాలంలో త‌న‌ను క‌లిసిన అధికారులు, సన్నిహతులు అందరూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ంటూ ట్వీట్‌ చేశారు. అందరూ క‌రోనా పరీక్ష‌లు చేయించుకోవడంతోపాటు, కొద్ది రోజుల‌పాటు హోమ్ క్వారెంటైన్‌లో ఉండాలని పోఖ్రియాల్‌ సూచించారు. (కరోనా సెకండ్‌ వేవ్‌ మోదీ మేడ్‌ డిజాస్టర్‌: దీదీ ఫైర్‌)

కాగా ఇప్పటికే పలు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు,  కేంద్ర, రాష్ట్ర మంత్రులు  కరోనా బారిన పడ్డారు. ఈ వారంలో  భార‌త మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌కు, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి క‌రోనా వైర‌స్ సోకిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలో రోజు రోజుకు వైరస్‌ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు దాదాపు మూడు లక్షలకు చేరువలో ఉన్నాయి. అలాగే  మరణాల సంఖ్య తాజాగా రెండువేల మార్క్‌ను దాటడం మరింత ఆందళన రేపుతోంది.   (ఆక్సిజన్‌ ట్యాంక్‌ లీక్‌ : 22 మంది మృతి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement