
సాక్షి, ఢిల్లీ: సీఎం కేసీఆర్ బెదిరింపులకు బీజేపీ భయపడదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2014లో కేంద్రం 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. 2021లో 94 లక్షల మెట్రిక్ టన్నుల రైస్ సేకరించామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘పంజాబ్ తర్వాత తెలంగాణ నుంచే ఎక్కువ కొనుగోలు చేశామని తెలిపారు. ‘‘రైతులను తప్పుదోవ పట్టించే విధంగా కేసీఆర్ మాట్లాడుతున్నారు. బాయిల్డ్ రైస్ దేశంలో ఉపయోగంలో లేదు. సాధ్యమైనంత వరకు బాయిల్డ్ రైస్ తగ్గించాలని చెప్పాం. రా రైస్ ఇస్తే కొనుగోలు చేస్తామని చెప్పామని’’ కిషన్‌రెడ్డి అన్నారు.
చదవండి: కేంద్రంపై కొట్లాటే..!: సీఎం కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment