సాక్షి, హైదరాబాద్: బీజేపీతోనే మార్పు సాధ్యమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన శామీర్‌పేటలో జరుగుతున్న బీజేపీ మూడు రోజుల శిక్షణా తరగతుల్లో మాట్లాడుతూ, గత పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం కూతురు, బంధువును ఓడించాం. అభద్రతా భావంతో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.
మునుగోడులో బీజేపీదే నైతిక విజయం. ప్రగతి భవన్‌లో కూర్చుని దేశ ఆర్థిక వ్యవస్థను విమర్శిస్తున్నారు. ప్రధాని విమర్శిస్తే.. స్థాయి పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారు ఫౌంహౌస్ ఫైల్స్‌కు భయపడేది లేదని కిషన్‌రెడ్డి అన్నారు.
పాత, కొత్త తేడా లేకుండా ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాలని బీజేపీ నేతలకు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. చిన్నచిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు.. సిద్ధాంతం కోసం కలిసి పనిచేయాలన్నారు. బీజేపీ నాయకత్వంపై విమర్శలు చేసి మళ్లీ ఓట్లు పొందాలని చూస్తున్నారు. వాళ్లు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగడం లేదు. జవాబు చెప్పకుండా దొంగే.. దొంగ దొంగ అని అరుస్తున్నట్లు ఉంది’’ అంటూ కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
చదవండి: తొమ్మిదేళ్ల క్రితం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఎదురేలేదు.. మరి నేడు?
Comments
Please login to add a commentAdd a comment