MP Utham Kumar Reddy Reacted to the News That the Party Is Changing - Sakshi
Sakshi News home page

ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ

Published Fri, Jun 23 2023 4:13 PM | Last Updated on Fri, Jun 23 2023 4:50 PM

Uttam Kumar Reddy Reacts To The Change Of Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరుతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టుతున్న క్రమంలో ఆయన క్లారిటీ ఇచ్చారు.

తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలో నిజం లేదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ప్రచారాలు చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని హెచ్చరించారు.

కాగా, ఉత్తమ్‌ పార్టీ వీడుతున్నారన్న ప్రచారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఆయనకు ఆఫర్‌ వచ్చినట్లు ప్రచారం జరిగింది. భార్య పద్మావతితో కలిసి బీఆర్ఎస్‌లోకి వెళ్తున్నట్లు ప్రచారం జరగడంతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. పార్టీని వీడుతున్నారన్న వార్తలను ఆయన ఖండించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement