సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాల అప్పుల వివరాలను కేంద్ర సోమవారం ప్రకటించింది. గత మూడేళ్లలో రాష్ట్రాలు తీసుకున్న అప్పుల జాబితాను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించారు. తెలంగాణ, ఏపీ అప్పలు జాబితాను విడుదల చేశారు.
2022 వరకు ఏపీ అప్పులు రూ. 3 లక్షల 98 వేల కోట్లు ఉండగా.. తెలంగాణ అప్పులు రూ. 3 లక్షల 12వేల కోట్లుగా ఉంది. 2014 నాటికి తెలంగాణ అప్పు కేవలం రూ. 64వేల కోట్లు మాత్రమే ఉంది. అయితే 2014లో రూ.18 వేలుగా ఉన్న తలసరి అప్పు.. 2022లో రూ.లక్షకు పెరిగింది.
తెలంగాణ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. 8 ఏళ్లలో తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని కేసీఆర్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. తెలంగాణలో అప్పులు చేసినా అభివృద్ధి కనిపించడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీలో అప్పులపై అనేకసార్లు ప్రస్తావించినా.. తమను పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ ఎడాపెడా అప్పులు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని స్థితికి ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతి, నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
చదవండి: కేసీఆర్‌తో కోల్డ్‌వార్.. గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment