సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అంతటి నీచ రాజకీయ నాయకుడు ఎవరూ లేరని, ఎన్ని గుళ్లకు తిరిగినా ఆయన పాపాలు పోవని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ 19-10-2017 కె. పంటపాడులో రథం దగ్ధమైంది. ఈ ఘటనపై చంద్రబాబు, బీజేపీ, జనసేన ప్రశ్నించలేదు. అంతర్వేది ఘటనను కావాలనే రాజకీయం చేస్తున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. అలజడి సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూశారు. ( ‘చంద్రబాబువి పగటి కలలు’ )
అంతర్వేది ఘటన కేసును సీబీఐకి అప్పగించాం. దేవాలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా కఠిన చర్యలు తప్పవు. 40 దేవాలయాలను కూల్చేసిన చరిత్ర చంద్రబాబుది. ఆయన హయాంలోని భూ దోపిడీని ఎందుకు ప్రశ్నించరు?. చేయని తప్పులను కూడా ప్రభుత్వానికి అంటగడుతున్నారు. ఇలాంటి దుర్మార్గపు పనులను ఎవరూ సమర్థించొద్ద’’ని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment