‘పురంధేశ్వరి సాయంతో చంద్రబాబు చీప్‌ పాలిటిక్స్‌’ | MLA Vellampalli Srinivas Satirical Comments On Chandrababu - Sakshi
Sakshi News home page

పురంధేశ్వరి సాయంతో చంద్రబాబు చీప్‌ పాలిటిక్స్‌: వెల్లంపల్లి వ్యాఖ్యలు

Published Wed, Aug 30 2023 3:31 PM | Last Updated on Wed, Aug 30 2023 5:51 PM

Vellampalli Srinivas Satirical Comments Over Chandrababu - Sakshi

సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌. ప్రధాని మోదీ, అమిత్‌షాల ప్రాపకం కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారు. పగటిపూట బీజేపీతో, రాత్రిపూట రాహుత్‌లో కాపురం చేసే వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. 

కాగా, వెల్లంపల్లి బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘ప్రధాని మోదీ ఏపీకి వస్తే నల్ల బెలూన్లు ఎగురవేశారు, అమిత్‌ షాపైకి రాళ్లు, చెప్పులతో దాడి చేశారు టీడీపీ నేతలు. ఇప్పుడు ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరిని అడ్డుపెట్టుకుని మళ్లీ బీజేపీకి దగ్గరవడానికి చూస్తున్నారు. ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయడం చంద్రబాబుకే చెల్లుతాయి. ఒంటరిగా పోటీచేసే ధైర్యం చంద్రబాబుకు లేదు. బీజేపీ అభయంతోనే గతంలో చంద్రబాబు గెలివగలిగాడు. అంతేతప్ప చంద్రబాబును చూసి ఎవరూ ఓటు వేయరు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతోనే పొత్తు అంటుంటే, చంద్రబాబు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. వైఎస్సార్‌సీపీని కాదని వెళ్లినవారిని సీఎం జగన్‌ సస్పెండ్‌ చేశారు. అలాంటి ధైర్యం చంద్రబాబుకు ఉందా?. అప్పట్లో ప్రత్యేక హోదా వద్దన్న వ్యక్తి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్తారు?. ఒంటరిగా పోటీచేసే ధైర్యం చంద్రబాబుకు లేదు’ అని సెటైర్లు వేశారు. 

ఇది కూడా చదవండి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య వైఎస్సార్‌ సీపీలో చేరిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement