
సాక్షి, తిరుమల: వైఎస్సార్ సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'పురందేశ్వరి ఈ రోజు ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూతో, అందులో రాజధాని, ప్రభుత్వ పనితీరు అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైంది' అంటూ ఎద్దేవా చేశారు. (అలా మొక్కారు.. ఇలా తొక్కారు!)
కాగా.. అంతకు క్రితం తిరుమల శ్రీవారిని ఎంపీ విజయసాయి రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే కొంతమంది రాజ్యాంగాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. అలాంటి వారికి బుద్దుని ప్రసాదించాలని దేవున్ని కోరుకున్నట్లు తెలిపారు.(టీడీపీలో గర్జించిన అసమ్మతి)
Comments
Please login to add a commentAdd a comment