సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌పై యుద్ధం మొదలైందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ మొదలు పెట్టిన యుద్ధానికి తాము సిద్ధమని ప్రకటించారు. ‘డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పనుల గురించి తెలుసు కోవడానికి వెళ్లే హక్కు కూడా కేంద్ర మంత్రిగా నాకు లేదా?’ అని ప్రశ్నించారు. ఒక నేరస్థుడు, ఉగ్ర వాదితో వ్యవహరించిన విధంగా తనతో పోలీస్ కమిషనర్, డీసీపీలు అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను ప్రగతిభ వన్‌లో కూర్చొని అణచివేస్తారా? అని దుయ్య బట్టారు. కిషన్‌రెడ్డి గురువారం ఉదయం శంషా బాద్ ఎయిర్‌పోర్టు వద్ద, ఓఆర్‌ఆర్‌పై, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
బీఆర్‌ఎస్‌ను గద్దె దించేవరకు పోరాటం
బాటసింగారంలో రెండు పడక గదుల ఇళ్ల పరిశీ లనకు బయలుదేరిన తనను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పిన తీరును కేంద్రమంత్రి తప్పు బట్టారు. ‘తెలంగాణలో పేద ప్రజలకు న్యాయం జరగడం లేదు. డబుల్ బెడ్‌రూం ఇళ్లూ ఇవ్వడం లేదు. బాటసింగారంలో మధ్యలోనే వదిలేశారు. వాటిని చూద్దామని బయలుదేరాం. ధర్నా, ఆందోళన కార్యక్రమాల వంటివి కాదని చెప్పినా.. పోలీసులు నియంతత్వ ధోరణితో వ్యవహరించారు. 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఓ కేంద్ర కేబినెట్ మంత్రిని ప్రజాసమస్యలను పరిశీలించేందుకు వెళ్తుండగా అక్రమంగా అరెస్టు చేశారు.
దీనిపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా. పోలీసులు కేసీఆర్ తొత్తుల్లాగా కాకుండా ప్రజాసేవకుల్లా వ్యవహరించాలి. కేంద్రమంత్రి కాన్వాయ్‌కి డీసీఎంను అడ్డంపెట్టి ఆపేంత అవసరం ఏమొచ్చింది? నేనేమైనా క్రిమినల్ నా? రాష్ట్రంలో దౌర్జన్య పాలన నడుస్తోంది. నిజాం కన్నా అధ్వానమైన పాలన ఇక్కడ ఉంది. ఈరోజు యుద్ధం మొదలైంది. కల్వకుంట్ల కుటుంబం, బీఆర్‌ఎస్‌తో యుద్ధానికి మేం సిద్ధం. ప్రజల సమస్యల తరఫున బీఆర్‌ఎస్‌ను గద్దెదించే వరకు పోరాటం కొనసా గిస్తాం. ఆ పార్టీ పాపాలు పండాయి. కల్వకుంట్ల కుటుంబం జైలు గదులు రెడీ చేసుకోవాలి..’ అంటూ కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
దమ్ముంటే 50 లక్షల ఇళ్లు కట్టండి...
‘సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే తెలంగాణలో 50 లక్షల ఇళ్లు కట్టాలి. 50 లక్షల ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం వాటా తెచ్చే బాధ్యత నాదే. ఖరీదైన ఇళ్లు కట్టుకోవడానికి, విమానాలు కొనడానికి కేసీఆర్‌కు డబ్బులుంటాయి కానీ పేద ప్రజలకు ఇళ్లు కట్టడానికి డబ్బులుండవా? అరకొరగా కట్టిన ఇళ్లు కూడా తొమ్మిదేళ్లుగా ఎవరికీ ఇవ్వలేదు. ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం..’ అంటూ ధ్వజమెత్తారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల కంటే తానే ఎక్కువ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని కిషన్‌రెడ్డి అన్నారు. ‘అరెస్టులు మాకు కొత్త కాదు. జైళ్లను సిద్ధం చేసుకోండి. ఎంతమందిని అరెస్టు చేస్తారో చేయండి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ఉద్య మంలో చావుకు కూడా భయపడం. పేదల పక్షాన పోరాడుతూనే ఉంటాం..’ అని స్పష్టం చేశారు.
ధర్నాకు అనుమతి ఇవ్వండి
హిమాయత్‌నగర్: బీజేపీ చేపట్టే ధర్నాకు పోలీసు శాఖ నుంచి అనుమతి ఇవ్వాలంటూ ఆ పార్టీ నేతలు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌ను కోరారు. ఈ మేరకు పార్టీ నాయకులు కొండా విశ్వేశ్వరరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీవీఎస్ ప్రభాకర్, ఏవీఎన్ రెడ్డి, రామచందర్‌లు గురువారం సీపీని కలసి వినతిపత్రం అందచేశారు.
Comments
Please login to add a commentAdd a comment