సాక్షి, గుంటూరు: డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. బాబు నీచ రాజకీయాలను ఆయన ఎండగట్టారు. తిరుమలలో నెయ్యి కల్తీ అంటూ.. రాజకీయాల కోసం దేవుడ్ని కూడా వాడుకునే నైజం బాబుది అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.
చంద్రబాబు కట్టుకథలు..
‘‘తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు కట్టుకథలు చెబుతున్నారు. నెయ్యికి బదులు జంతు కొవ్వు వాడారని దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారు. సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం కరెక్టేనా?. కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం సబబేనా? అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: శ్రీవారి లడ్డూపై CBN ఉన్మాద రాజకీయం
దశాబ్ధాల తరబడి ఒకే విధానంలో లడ్డూ తయారీ సామాగ్రీ కొనుగోలు ప్రక్రియ జరుగుతుంది. ప్రతి ట్యాంకర్ ఎన్‌ఏబీఎల్ సర్టిఫికెట్ తీసుకుని రావాలి. ఆ తర్వాత టీటీడీ మూడు శాంపిల్స్‌ను తీసుకుని టెస్ట్ చేస్తుంది. ఈ టెస్ట్‌లు పాసైతేనే ఆ సామాగ్రిని టీటీడీ అనుమతిస్తుంది. ఈ విధానమంతా దశాబ్దాల నుంచి జరుగుతుంది.’’ అని వైఎస్ జగన్ వివరించారు.
అబద్ధాలకు రెక్కలు..
‘‘2014-19 మధ్య 14 నుంచి 15 సార్లు రిజక్ట్ చేశారు. మా హయాంలో 18 సార్లు రిజక్ట్ చేశాం. టీటీడీకి అద్భుతమైన వ్యవస్థ ఉందని చెప్పడం మానేసి చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కడుతున్నారు. జులై 12న శాంపిల్స్ తీసుకున్నారు. ఆ సమయంలో సీఎంగా ఉన్నది చంద్రబాబే.మూడు టెస్ట్‌లు చేశాక జులై 17న ఎన్‌డీడీబీకి పంపారు. 2 నెలలు క్రితం రిజక్ట్ అయితే ఇప్పటివరకు బాబు ఏం చేస్తున్నారు.’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
సీజేఐ, ప్రధానికి లేఖ రాస్తాం..
తిరుమల శ్రీవారి ప్రతిష్టను చంద్రబాబు దిగజారుస్తున్నాడు. ఈ తప్పూ జరగకపోయినా టీటీడీ పరువును బజారు కీడుస్తున్నారు. ఈ విషయంపై సీజేఐ, ప్రధాని మోదీకి లేఖ రాస్తాం. 9 వేల మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలిచ్చాం. ఏ తప్పు జరగనప్పటికీ నేషనల్ మీడియా కూడా తప్పు జరిగినట్టు చూపిస్తోంది. టీటీడీ లడ్డు తయారీ గొప్ప కార్యక్రమమని చెప్పుకోవాలి. టీటీడీకి అద్భుత వ్యవస్థ ఉందని గొప్పగా చెప్పుకోవాలి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాకే నవనీత సేవ నిర్వహించాం. దీని కోసం మొదటగా తిరుమలలో గోశాల పెట్టాం’’ అని వైఎస్ జగన్ తెలిపారు.
చంద్రబాబుది ఎప్పుడూ దుర్భుదే..
బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే అబద్ధాల చంద్రబాబుకు అక్షింతలు వేయాలి. దేవుడ్ని రాజకీయాలకు వాడుకునే హేయమైన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబుది ఎప్పుడూ దుర్భుదే. టీటీడీ బోర్డు చాలా విశిష్టమైనది. కేబినెట్ కూర్పు కంటే కూడా టీటీడీ బోర్డు నియామకం చాలా కష్టమైనది. దేవునికి మంచి చేయడం ఎలా అనేదే వాళ్లు ఆలోచిస్తారు. వైఎస్సార్‌సీపీ హయాంలోనే జీర్ణావస్థలో ఉన్న ఆలయాలు పునరుద్ధరణ జరిగింది. హైదరాబాద్, చెన్నై, జమ్మూకశ్మీర్, భువనేశ్వర్‌లో కూడా టీటీడీ ఆలయాలు నిర్మించాం’’ అని వైఎస్ జగన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment