గుంటూరు, సాక్షి: సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసినా.. తప్పులను ఎత్తి చూపినా.. అణచివేసే కార్యక్రమం ఏపీలో కొనసాగుతోంది. తప్పుడు కేసుల బనాయింపు.. అక్రమ నిర్బంధాలతో వేధిస్తోంది. అయితే గురివింద గింజ సామెతలాగా.. వాళ్లు మాత్రం ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. తాజాగా..
ఈ మధ్యకాలంలో తెలుగు దేశం అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ మరీ శ్రుతి మించిపోతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ తాజా ప్రెస్‌మీట్‌ను ఉద్దేశించి.. ఓ అసభ్యకరమైన పోస్టు ఉంచింది. ఆ పోస్టుపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు.
మా నాయకుడిపై(వైఎస్ జగన్) ఇలాంటి మార్ఫింగ్ పోస్టులు పెడుతూ.. నీతులు చెబుతూ.. కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారాయన. తామూ అలా చేయగలమని, తక్షణమే డిలీట్ చేయకపోతే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారాయన. ఈ క్రమంలో ఏపీ పోలీసులను ట్యాగ్ చేశారాయన.
ఈ విధంగా మార్ఫింగ్ చేసి
మా నాయకుడిపై పోస్టులు పెడుతూ
మాకు నీతులు చెప్తారు కేసులు పెడతారు
మేము కూడా @ncbn @naralokesh
నీ మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టలేమా ?
ఈ అసభ్యకర పోస్టుని తక్షణమే డిలీట్ చేయండి,లేదంటే చట్టపరమైన చర్యలకు
వెళ్తాం జాగ్రత్త ! @iTDP_Official @APPOLICE100 https://t.co/H1tG1NnswB— Ambati Rambabu (@AmbatiRambabu) November 29, 2024
Comments
Please login to add a commentAdd a comment