ఎన్నికల సంఘం జాయింట్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు
సాక్షి, అమరావతి: పార్టీల రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు శుక్రవారం ఫిర్యాదు చేసింది. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని, తక్షణమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, అధికార ప్రతినిధి అంకంరెడ్డి నారాయణమూర్తి, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, హైకోర్టు లీగల్ సెల్ ప్రతినిధులు రాజేశ్వర్‌రెడ్డి, మేకల రవికుమార్ ఎన్నికల సంఘం జాయింట్ సెక్రటరీ రామారావును కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు ‘పల్లె ప్రగతి–పంచసూత్రాలు’ పేరుతో ప్రచురించిన ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గురువారం విడుదల చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇందులో ఓటర్లను ప్రభావితం చేసేలా పలు పథకాలు, హామీలు పొందుపర్చారని తెలిపారు. పార్టీ రహితంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని.. పార్టీ గుర్తులు, కరపత్రాలు, ఫ్లెక్సీలు రాజకీయ పార్టీలు వాడకూడదని చట్టం స్పష్టంచేస్తోందని కమిషన్ దృష్టికి వారు తీసుకెళ్లారు. అయితే, టీడీపీ ఇందుకు విరుద్ధంగా మేనిఫెస్టో విడుదల చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనని తెలిపారు. మేనిఫెస్టో వల్ల గ్రామాల్లో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగి ఎన్నికల లక్ష్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తంచేశారు. మేనిఫెస్టో ప్రతులను పంచాయతీల్లో పంచేందుకు టీడీపీ చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని.. నిబంధనలు ఉల్లంఘించిన చంద్రబాబు, ఆయన అనుచరులపై
Comments
Please login to add a commentAdd a comment