సాక్షి, తిరుపతి జిల్లా: ఉత్కంఠభరితంగా సాగిన తిరుపతి డిప్యూటీ మేయర్ (Tirupati Deputy Mayor) పదవి ఎన్నికల్లో కూటమి నేతలు తమను కొట్టి బెదిరించారంటూ నలుగురు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు మాజీ మంత్రి, భూమన కరుణాకర్‌రెడ్డి (bhumana karunakar reddy) కాళ్ల మీద పడి క్షమాపణలు కోరారు.
డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం భూమన కరుణాకర్‌రెడ్డి నివాసానికి టీడీపీకి ఓటేసిన నలుగురు వైఎస్సార్‌సీపీ (ysrcp corporators) కార్పొరేటర్లు వచ్చారు. బెదిరించి కూటమికి ఓట్లు వేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు అయిందంటూ భూమన కాళ్లమీద పడి క్షమాపణ కోరారు. కూటమి నేతలు తమను కొట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నలుగురు కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ.. పశ్చాత్తాపంతో తమను క్షమించమని వేడుకుంటూ భూమన కరుణాకరరెడ్డిని మేం నలుగురం (కార్పొరేటర్లు) అనీష్, అనిల్, మోహన్ కృష్ణ యాదవ్, అమరనాథ్ రెడ్డిలు ప్రాధేయపడ్డాం. తామంతా వైఎస్సార్‌సీపీ అధినతే, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం కోరుకునే వాళ్ళమని, మమ్మల్ని భయపెట్టి, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తామని బెదిరించి కిడ్నాప్ చేశారు.
వాళ్ళకి భయపడి ఓటు వేయాల్సి వచ్చింది, తప్పు జరిగి పోయింది క్షమించమని కరుణాకర్ రెడ్డిని వేడుకుంటున్నాం: అనీష్ రాయల్
ఎత్తుకెళ్లి మాపై భౌతికంగా దాడి చేసి, ఇబ్బందులు పెట్టారు. ఓటు వేయకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు..భయపెట్టారు: అనీష్ రాయల్ , అనిల్, మోహన్ కృష్ణ యాదవ్
నన్ను ఎంతగా భయపెట్టినా టీడీపీకు అనుకూలంగా ఓటు వేయను అని స్పష్టం చేశాను. భయపెట్టి, బెదిరింపులకు పాల్పడ్డారు. నేను ఎవరికీ ఓటు వేయకుండా తటస్థంగా ఉన్నాను.నేను వైఎస్సార్‌సీపీలో గెలిచాను, ఆ పార్టీలోనే చివరి వరకు కొనసాగుతా. జరిగిన పరిస్థితులు అర్థం చేసుకుంటారని, పశ్చాత్తాపంతో కరుణాకర్ రెడ్డి వద్దకు వచ్చాను: 5వ డివిజన్ కార్పొరేటర్ అమరనాథ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment