సాక్షి, అమరావతి: వ్యవస్థలను నాశనం చేసింది చంద్రబాబు కాదా అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అనివార్య పరిస్థితుల్లోనే స్వల్పంగా విద్యుత్ ఛార్జీలు పెంచామన్నారు. విద్యుత్ వ్యవస్థను నాశనం చేసింది చంద్రబాబే. అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలు పెంచింది టీడీపీ ప్రభుత్వమేనంటూ మండిపడ్డారు. టీడీపీ హయాంలోని ఐదేళ్లలో 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని దుయ్యబట్టారు.
చదవండి: చంద్రబాబుకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి సవాల్
‘‘పేదల ఖాతాల్లో ప్రభుత్వం రూ.లక్షా 35 వేల కోట్లు వేసింది. కొత్త జిల్లాలు, సచివాలయాలతో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. వీటిని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. లోకేష్ పగటి పూట లాంతర్లు పట్టుకుని తిరుగుతున్నారు. పవన్ తన పవర్ చూపించి కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు’’ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment