సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని మానసిక రోగిగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అభివర్ణించారు. ఉన్మాది, ఉగ్రవాదిలా చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సంక్షేమ పాలనను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ పత్రికలతో దుష్ప్రచారం చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇళ్ల పట్టాల పంపిణీని చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని అందుకే కుల, మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు.(చదవండి: 'పుట్టుకతోనే ఎన్నికల కమిషనర్‌గా ఫీలవుతున్నాడు')
విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు అమలు చేశామని, పేదల సొంతింటి కల నెరవేరుస్తుంటే.. చంద్రబాబుకు ఎందుకంత కడుపుమంట అని ప్రశ్నించారు. సమస్యలు సృష్టించేందుకు ఆయన కుట్రలు పన్నుతున్నారని జోగి రమేష్ దుయ్యబట్టారు. ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సింది ఎన్నికలు కాదు. వ్యాక్సిన్ కావాలి. కరోనా నివారణలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎలా పనిచేసిందో ప్రజలందరికి తెలుసు. వారందరికి వ్యాక్సిన్ అందించడమే ప్రభుత్వ ధ్యేయం’’ అని ఎమ్మెల్యే జోగి రమేష్ పేర్కొన్నారు. (చదవండి: నిమ్మగడ్డకు ఉద్యోగుల ప్రాణాలు పట్టవా?)
Comments
Please login to add a commentAdd a comment