
సాక్షి, విశాఖపట్నం: దళితులపై చంద్రబాబుకు ప్రేమ లేదని.. దళితుల పేరు ఎత్తే అర్హత ఆయనకు లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. శనివారం విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ దళిత ద్రోహి చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు.
చదవండి: Andhra Pradesh: వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు..
టీడీపీతో కలిసి అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ.. జిన్నా టవర్ పేరు ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ పాకులాడుతుందన్నారు. దళితులకు ఇళ్ల పట్టాలు రాజధానిలో ఇస్తే చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘డాక్టర్ సుధాకర్ మృతికి కారణం చంద్రబాబు కదా.. రామ కుప్పంలో అంబేడ్కర్ విగ్రహం వైస్సార్సీపీ నేతలు పెట్టనివ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏమోహం పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తావు. దళితుల అభివృద్ధిపై చంద్రబాబుతో బహిరంగ చర్చకు మేము సిద్ధం. అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహాలు పడగొడ్డించిన ఘనత చంద్రబాబుది. చంద్రబాబు మాటలు విని దళితులు మోసపోవద్దు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని’’ మేరుగ నాగార్జున గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment