వలంటీర్లపై బాబు, పవన్‌ మాటలు ఏమయ్యాయి?: నారాయణ స్వామి | YSRCP Narayana Swamy Serious Comments On CBN Govt Over Volunteer System, More Details Inside | Sakshi
Sakshi News home page

వలంటీర్లపై బాబు, పవన్‌ మాటలు ఏమయ్యాయి?: నారాయణ స్వామి

Published Tue, Nov 26 2024 9:15 PM | Last Updated on Wed, Nov 27 2024 11:23 AM

YSRCP Narayana Swamy Serious Comments On CBN Govt

సాక్షి, చిత్తూరు: ఏపీలో వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చి.. ఇంకా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని కామెంట్స్‌ చేశారు. చంద్రబాబు సంపద సృష్టి ఏమైందని ప్రశ్నించారు.

మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ..‘రాజ్యాంగం ఆమోదించిన రోజు అయినప్పటికీ ఈరోజున పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు. చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చి మోసం చేస్తూనే ఉన్నాడు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేశాడు. నవరత్నాలు పేరుతో హామీలను అమలు చేసిన ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది. విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకువస్తే చంద్రబాబు వాటిని తుంగలోకి తొక్కాడు. ప్రతీ పేదవాడు ఉన్నత విద్యావంతుడు కావాలని, ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించిన వ్యక్తి వైఎస్‌ జగన్‌.

స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కోటీశ్వరుల బిడ్డలు, డబ్బున్న వారికే ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉండేది. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీ పేదవారికి ఇంగ్లీష్‌ మీడియం అందుబాటులోకి తీసుకువచ్చారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తున్నారు. వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఏమయ్యాయి?. కేంద్రప్రభుత్వ సంస్థ సెకీ అనే సోలార్ ఎనర్జీకి సంబంధించి యూనిట్ రూ.2.49లపై చెల్లించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపితే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో విద్యుత్ ఒప్పందాలు  రూ.5.98 జరిగితే ఆరోజు ఎల్లో మీడియా ప్రశ్నించలేదు.

చంద్రబాబు నాయుడు ఏం చెబితే అదే వింటున్నారు జిల్లాల ఎస్పీలు. తప్పుడు కేసులు పెట్టీ వైఎస్సార్‌సీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు.. మంత్రులు, టీడీపీ కార్యకర్తలకు బెల్ట్‌ షాపుల ద్వారా సంపద సృష్టిస్తున్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్‌ జగన్‌ను ఏమీ చేయలేరు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement