సాక్షి, తిరుపతి: తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలను వైఎస్సార్‌సీపీ కైవశం చేసుకుంది. ఇక్కడ భారీ మెజారిటీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. తిరుపతి కార్పొరేషన్‌లో విపక్షాలన్నీ సాధించిన ఓట్ల కంటే రెట్టింపు ఓట్లను పొంది వైఎస్సార్‌సీపీ విజయ బావుటా ఎగురవేయడం గమనార్హం. టీడీపీ, బీజేపీ–జనసేన ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. తిరుపతి కార్పొరేషన్‌తోపాటు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలు పొందారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నూ అత్యధికులు వైఎస్సార్‌సీపీ అభిమానులే నెగ్గారు. తిరుపతి కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో టీడీపీ, బీజేపీ, జనసేన లోపాయికారీ ఒప్పందంతో పరస్పరం మద్దతిచ్చుకున్నా ఫలితం లేకపోవడంతో ఉప ఎన్నికలపై తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.
► తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 22 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. ఎన్నికలు జరిగిన 27 డివిజన్లలో వైఎస్సార్‌సీపీకి 47,745 ఓట్లు వచ్చాయి. టీడీపీ 18,712, బీజేపీ 2,546, జనసేన 231, సీపీఎం 1,338, సీపీఐ 619 ఓట్లు రాబట్టుకున్నాయి.
► సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 14 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 11 వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 6,000 ఓట్లు వచ్చాయి. టీడీపీ 2,380, బీజేపీ 874 ఓట్లు రాబట్టుకున్నాయి.
► నాయుడుపేట మున్సిపాలిటీలో 22 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 3 వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 1,735 ఓట్లు వచ్చాయి. టీడీపీ 178, కాంగ్రెస్ 345 ఓట్లు దక్కించుకున్నాయి.
► వెంకటగిరి మున్సిపాలిటీలో 3 వారుల్ని వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా సాధించింది. 22 వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 16,883 ఓట్లు లభించాయి. టీడీపీ, 8,369, బీజేపీ 41, జనసేన 202, సీపీఐ 43 ఓట్లు రాబట్టుకున్నాయి. శ్రీకాళహస్తి, గూడూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగలేదు.
తిరుపతి తీర్పుతో విపక్షాల్లో వణుకు!
Published Mon, Mar 15 2021 4:17 AM | Last Updated on Mon, Mar 15 2021 12:40 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment