సాక్షి, మెదక్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పలువురు నేతల్ని అరెస్ట్ చేశారు. హవేలి ఘనపూర్ మండలంలోని బోగడ భూపతిపూర్ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుమార్ కుటుంబాన్ని వైఎస్ షర్మిల శనివారం పరామర్శించారు. బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆమె నిరాహార దీక్ష తలపెట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి పేరు చెప్పి, ఆత్మహత్య చేసుకున్న ఈ రైతు కుటుంబానికి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. లేదంటే రైతులకు క్షమాపణ చెప్పి, పదవికి రాజీనామా చేయాలని పేర్కొన్నారు.
బలవంతంగా దీక్ష నుంచి అరెస్ట్ చేయడాన్ని వైఎస్ షర్మిల ఖండించారు. రైతుల కోసం శాంతియుతంగా పోరాటం చేస్తుంటే.. అత్యంత దారుణంగా పోలీసులు దాడి చేసి, అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని మరోసారి ఖూనీ చేశారని మండిపడ్డారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి, ఉద్యమాలను అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రాక్షస పాలనను పాలనను త్వరలోనే అంతం చేస్తామన్నారు.
రైతుల కోసం శాంతియుతంగా పోరాటం చేస్తుంటే.. అత్యంత దారుణంగా పోలీసులు దాడి చేసి, అరెస్టు చేయడం సిగ్గుచేటు. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని మరోసారి ఖూనీ చేశారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి, ఉద్యమాలను అణచివేస్తున్నారు. ఖబడ్దార్ KCR.. నీ రాక్షస పాలనను త్వరలోనే అంతం చేస్తాం. pic.twitter.com/49vVBAufsm
— YS Sharmila (@realyssharmila) December 11, 2021
Comments
Please login to add a commentAdd a comment