‘చలో కర్నూలు’ను మాలలు జయప్రదం చేయాలి
ఒంగోలు వన్‌టౌన్: చలో కర్నూలు కార్యక్రమాన్ని మాలలు జయప్రదం చేయాలని మాల మహాసభ జాతీయ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు అన్నారు. ఒంగోలు బీఎస్‌ఎన్‌ఎల్ సేవా కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కులగణన, ఎంపరికల్ డేటా లేకుండా, ఎస్సీలను వర్గీకరణ చేసే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. గతంలో కూడా చంద్రబాబు మాలలను అణగదొక్కాలని ఎస్సీ వర్గీకరణ చేసి అభాసు పాలయ్యాడన్నారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకణ బిల్లు పెడితే చంద్రబాబు రాజకీయానికి మాలలు చరమ గీతం పాడతారన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈనెల 23న కర్నూలులో భారీ బహిరంగ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చప్పిడి వెంగళరావు, సంపత్ కుమార్, యెరిచర్ల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment