● ప్రశాంతంగా ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు ● గైర్హాజరై
విజయోస్తు
ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అధికారులు ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసి పకడ్బందీగా నిర్వహించారు. మొదటి రోజు ఇంటర్ రెండో సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొదటి రోజు 19213 మందికి గాను 18450 మంది విద్యార్థులు హాజరయ్యారు. 763 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ 17,252 మంది విద్యార్థులకుగాను 16,659 మంది హాజరవగా, 593 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షకుగాను 1961 మందికి గాను 1791 మంది విద్యార్థులు హాజరవగా 170 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు నిర్వహించడానికి జిల్లాలో 67 సెంటర్లు కేటాయించారు. ఆర్‌ఐఓలు ఐదుగురు, 10 మంది డీఈసీ–డీఐఈఓలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. 33 మంది స్క్వాడ్స్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
● ప్రశాంతంగా ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు ● గైర్హాజరై
Comments
Please login to add a commentAdd a comment