సంతనూతలపాడు మండలంలోని మైనంపాడుకు చెందిన ఆకుల మోహన్‌రావు దేశ సరిహద్దులలో సైనికుడిగా పనిచేశారు. 1998లో జరిగిన కార్గిల్ పోరాటంలో శత్రు దేశానికి వ్యతిరేకంగా ప్రాణాలకు
తెగించి పోరాడారు. భూమికి 5140 అడుగుల ఎత్తులో ఉన్న టోలోలింగ్ పర్వతంపైన బోఫోర్స్ తుపాకీతో పోరాడారు. 2000 సంవత్సరంలో రిటైర్డ్ అయిన మోహన్‌రావు స్వగ్రామానికి చేరుకుని లారీ కొనుక్కున్నారు. పదేళ్లుగా ఇసుక విక్రయిస్తున్నారు. ఎనాడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో దారుణంగా తయారైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జనవరిలో ఆయన టిప్పర్ ఆపిన ఇసుక మాఫియా..
డ్రైవర్‌ను చితకబాది టిప్పర్ తీసుకెళ్లి మూడు రోజుల పాటు యార్డులో నిర్బంధించారు.
Comments
Please login to add a commentAdd a comment