● కలెక్టర్ తమీమ్‌అన్సారియా
ఒంగోలు సిటీ: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ లో వచ్చే అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన శ్రీమీ కోసం్ఙ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ వీటిని ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించాలని స్పష్టం చేశారు. ‘మీ కోసం’ కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ప్రతి ఒక్క అర్జీ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వాటికి అర్ధవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కారం చూపాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితిల్లో అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని ఆదేశించారు. అధికారులు ప్రతి రోజు లాగిన్ అయి ఆన్ లైన్ లో వచ్చిన వినతులను చూడాలని చెప్పారు. సాంకేతిక సమస్యల వలన క్షేత్రస్థాయిలో పరిష్కరించలేని అర్జీలు వస్తే ఆ విషయాన్ని ప్రజలకు అప్పుడే స్పష్టం చేయాలన్నారు. ఒంగోలు నియోజకవర్గం యరజర్ల, కొణిజేడు నుంచి వందల టిప్పర్లతో రోడ్లు మొత్తం నాశనం చేస్తూ శబ్ద కాలుష్యం సృష్టిస్తూ జరుగుతున్న అక్రమ మైనింగ్ మాఫియా మీద చర్యలు తీసుకోవాలని కలెక్టరుకు స్థానికులు అర్జీ ఇచ్చారు. కలెక్టరు వెంటనే మైనింగ్ మాఫియా మీద చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో బి.చిన ఓబులేసు, డిప్యూటీ కలెక్టర్లు జాన్సన్, పార్ధసారథి, వరకుమార్, విజయజ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment