మంచం పట్టిన కుంచేపల్లి ఎస్సీ కాలనీ
పొదిలి రూరల్: పారిశుధ్యం లోపించడం, దోమలు విజృంభిస్తుండటంతో పొదిలి మండలంలోని కుంచేపల్లి ఎస్సీ కాలనీని వ్యాధులు చుట్టుముట్టాయి. గత వారం రోజుల నుంచి కాలనీ వాసులు టైఫాయిడ్, చికున్‌గున్యా, మలేరియా జ్వరాలతో విలవిల్లాడుతున్నారు. కాలనీలో ఎవరిని పలకరించినా శ్రీఒళ్లు నొప్పులు.. జ్వరంశ్రీ అంటూ దీనంగా చెబుతున్న పరిస్థితి. విష జ్వరాలు సోకిన బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటుండగా.. గొంతు నొప్పి, జలుబు, పొడి దగ్గు, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు మంచం పట్టారు. పౌల్ అనే రేషన్ డీలర్ కుటుంబ సభ్యులందరికీ విష జ్వరాలు సోకడంతో దాదాపు లక్ష రూపాయలు ఖర్చు చేసినట్లు వాపోయారు. కాలనీలో ఉన్న ఆదర్శ పాఠశాలలో 64 మంది విద్యార్థులు ఉండగా 25 మందికి విష జ్వరాలు సోకి బడికి రావడం లేదని ఉపాధ్యాయులు తెలిపారు.
నేను రాను.. మీకు చేతనైంది చేసుకో..
ఎస్సీ కాలనీలో జ్వర పీడితులు కొందరు అతి కష్టం మీద ఆస్పత్రికి వెళ్తున్నారు. వయసు పైబడిన వారు, నడవలేని స్థితిలో ఉన్న కొందరు బుధవారం ఉదయం 108 వాహనానికి ఫోన్ చేయగా కాలనీ మెయిన్ రోడ్డు వరకు వచ్చారు. గురవమ్మ అనే మహిళ నడవలేక ఇబ్బంది పడుతుండగా ఇంటి దగ్గరకు రమ్మని పిలిచారు. రావడం కుదరదని 108 సిబ్బంది చెప్పడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. శ్రీమీకు చేతనైంది చేసుకోండి.. సంతకం పెడితే వెళ్లిపోతామశ్రీ తెగేసి చెప్పడంతో చేసేది లేక గురవమ్మను ఎత్తుకుని 108 వాహనం దగ్గరకు తీసుకువెళ్లారు. 108 సిబ్బంది మానవతా దృక్పథంతో వ్యవహరించకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఇదిలా ఉండగా వారం రోజుల నుంచి కాలనీ వైపు రాని వైద్య సిబ్బంది బుధవారం హడవుడిగా వచ్చి మొక్కుబడిగా వైద్య శిబిరం నిర్వహించారు.
పారిశుధ్యంపై
ముందస్తు చర్యలేవి?
కాలనీలో పారిశుధ్యాన్ని గాలికొదిలేయడం వల్లే దోమలు విజృంభించి జ్వరాల బారిన పడినట్లు స్థానిక పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. డ్రెయినేజీల్లో పేరుకుపోయిన మురుగు దోమ విజృంభణకు కారణమవుతోంది. వీధుల్లో చెత్తా చెదారం, పరిసరాలు అధ్వానంగా ఉండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. కాలనీ మొత్తం జ్వరాల బారిన పడి అల్లాడుతుంటే కనీసం బ్లీచింగ్ చల్లించకుండా, ఫాగింగ్ చేయించకుండా వైద్యారోగ్య శాఖ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి చోద్యం చూడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జ్వరంతో
బాధపడుతున్న రేషన్ డీలర్
పౌలు
ఒక్క ఆదర్శ పాఠశాలలోనే 25 మంది
విద్యార్థులకు జ్వరం
కాలనీలోనూ మరింత మంది జ్వర పీడితులు
దారుణంగా పారిశుధ్యం.. పట్టించుకోని
అధికారులు
నడవలేని స్థితిలో ఉన్నవారి ఇంటి వద్దకు
రాని 108 వాహనం
మంచం పట్టిన కుంచేపల్లి ఎస్సీ కాలనీ
మంచం పట్టిన కుంచేపల్లి ఎస్సీ కాలనీ
మంచం పట్టిన కుంచేపల్లి ఎస్సీ కాలనీ
Comments
Please login to add a commentAdd a comment