కారు, మోటార్‌సైకిల్ ఢీ
పెద్దదోర్నాల: ఎదురెదురుగా వస్తున్న కారు, మోటార్‌సైకిల్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని హసానాబాద్ బస్టాఫ్ వద్ద అదివారం జరిగింది. ప్రమాదంలో మండల పరిధిలోని చాట్లమడ అగ్రహారానికి చెందిన జడ్డా మార్కు, జడ్డా అఖిల్, జడ్డా దేవరాజ్, జడ్డా దిలీప్‌లకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 వాహనం క్షతగాత్రులను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. స్థానికుల కథనం మేరకు..చాట్లమడ అగ్రహారం నుంచి మండల కేంద్రానికి వస్తున్న మోటార్‌సైకిల్ మండల కేంద్రం నుంచి రామాయపాలెం వెళ్తున్న కారు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మెరుగైన వైద్యం నిమిత్తం క్షతగాత్రులను నర్సారావుపేటకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ముగ్గురు చిన్నారులతో సహా నలుగురికి గాయాలు
కారు, మోటార్‌సైకిల్ ఢీ
Comments
Please login to add a commentAdd a comment