
శభాష్ ప్రణవి
● షూటింగ్‌లో రెండు రజతాలు సొంతం ● అభినందించిన ఎస్పీ దామోదర్
ఒంగోలు టౌన్: న్యూఢిల్లీలో గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి మాసాల్లో నిర్వహించిన 67వ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల షూటింగ్(పిస్టల్) సీనియర్, జూనియర్ మిక్స్‌డ్ విభాగంలో కొత్తపట్నం మండలం రంగాయపాలెం గ్రామానికి చెందిన ద్వారం ప్రణవి సత్తా చాటి రెండు రజత పతకాలు సాధించింది. అలాగే ఖేలో ఇండియా యూనివర్శిటీ టోర్నమెంట్‌లో 4వ స్థానంలో నిలిచి ప్రతిభ చాటింది. ఆమెను మంగళవారం జిల్లా పోలీసు కార్యలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి ప్రకాశం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడలతోపాటు చదువులోనూ రాణించాలని సూచించారు. ప్రణవి వెంట ఆమె తండ్రి జాలిరెడ్డి ఉన్నారు.
రికార్డులు సక్రమంగా నిర్వహించాలి
● డీఆర్‌డీఏ పీడీ నారాయణ
ఒంగోలు వన్‌టౌన్: మండల సమాఖ్య రికార్డులు సక్రమంగా నిర్వహించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ టి.నారాయణ ఆదేశించారు. ఒంగోలు భాగ్యనగర్‌లోని టీటీడీ సెంటర్‌లో జిల్లాలోని 38 మండలాల మండల సమాఖ్య అకౌంటెంట్లకు మంగళవారం శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. సంస్థాగత నిర్మాణంలో ఉన్న పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ నెలలో అర్హులైన లబ్ధిదారులకు సిఫ్‌ను అప్పుగా మంజూరు చేయాలన్నారు. జిల్లాలోని అన్ని మండలాలు ఏ గ్రేడ్ పరిధిలోకి రావాలన్నారు. స్వయం సహాయక గ్రూపుల గ్రేడింగ్, సిఫ్ రికవరీలో ముందంజలో ఉండాలని చెప్పారు. సమావేశంలో డీఆర్‌డీఏ ఉద్యోగులు నరసింహరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలని వినతి
ఒంగోలు సిటీ: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ అన్సారియాను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఒకటికి నాలుగు శాఖలకు సంబంధించిన పనులు చేయిస్తున్నారని పేర్కొన్నారు. అయినా పదోన్నతులు లేవని వాపోయారు. తమతో పాటు రిక్రూట్ అయిన సచివాలయ ఉద్యోగులు చాలా మంది పదోన్నతులపై వెళుతున్నా..మాకు ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో అన్ని అభివృద్ధి పనులతో పాటు వివిధ సర్వేలు చేయడంలో ఇంజినీర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఏవీ శివ సూర్య తేజ, జిల్లా నాయకులు రామాంజనేయులు, వెంకట రమేష్, రాజేష్, పలువురు ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఉన్నారు.

శభాష్ ప్రణవి

శభాష్ ప్రణవి
Comments
Please login to add a commentAdd a comment