పోలింగ్ బూత్‌లు, ఓటర్ల జాబితా పక్కాగా ఉండాలి
● డీఆర్వో చిన ఓబులేసు
ఒంగోలు సిటీ: పోలింగ్ బూత్‌లు, ఓటర్ల జాబితా పక్కాగా ఉండాలని డీఆర్వో చిన ఓబులేసు అన్నారు. ఒంగోలు కలెక్టరేట్‌లోని డీఆర్వో చాంబర్‌లో మంగళవారం రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఓటుకు ఆధార్ అనుసంధానం చేస్తామని తెలిపారు. జిల్లాలోని పోలింగ్ స్టేషన్లు సరిగ్గా ఉన్నదీ, లేనిది గుర్తిస్తామని, పోలింగ్ బూత్‌కు 1400 ఓట్లు దాటితే వేరే కొత్త పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. పొలిటికల్ పార్టీలు బీఎల్‌ఏలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. చనిపోయిన వారి ఓట్లు తెలపాలని, వారి ఓట్లు తొలగించటానికి ప్రజల సహకరించాలని కోరారు. కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న, కనిగిరి ఆర్డీవో కేశవర్ధనరెడ్డి స్పెషల్ డిప్యుటీ కలెక్టర్లు, వెంకట శివ రామిరెడ్డి, జాన్సన్, ఎ.కుమార్, వరకుమార్, సత్యనారాయణ, శ్రీనివాసరావు, జిల్లా ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, పొలిటికల్ పార్టీల ప్రతినిధులు దామరాజు క్రాంతికుమార్, రసూల్, వెంకటరావు, బసినేపల్లి రాజశేఖర్, గుర్రం సత్యం, వేష పోగు సుదర్శన్, వెంకటస్వామి, రమేష్, తహశీల్దార్లు, ఎన్నికల అధికార్లు రాజశేఖర్ రెడ్డి, ఉపేంద్ర,పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment