
ప్రభుత్వ ఉద్యోగుల సంఘ మహిళా విభాగం ఎన్నిక
జిల్లా చైర్‌పర్సన్‌గా కాట్రగడ్డ రజిత మానస
ఒంగోలు సిటీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం జిల్లా చైర్‌పర్సన్‌గా డాక్టర్ కాట్రగడ్డ రజిత మానసను ఎంపిక చేసినట్లు సంఘ జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా మహిళా విభాగం ఏర్పాటుపై కమిటీ సమావేశం నిర్వహించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. మహిళా విభాగం జిల్లా కన్వీనర్‌గా వనజ, ట్రెజరర్‌గా ప్రసన్నను ఎంపిక చేసినట్లు తెలిపారు. కో చైర్మన్లుగా శ్రీదేవి, గౌరి, అనుపమ, గురుదేవి, సునీత, కో కన్వీనర్లుగా సుజాత, నాగమణి, త్రివేణి, ప్రసన్న, జి.సుజాత, ప్రతిమ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళా విభాగం చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. జిల్లాలో వివిధ శాఖల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘ జిల్లా కార్యదర్శి వరకుమార్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు మోటూరు శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా అధ్యక్షుడు సురేష్ బాబు, గోపీకృష్ణ, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.