ఘనంగా నర్సింహారెడ్డి వర్ధంతి
సిరిసిల్లటౌన్: ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి వర్ధంతిని జిల్లా రెడ్డి సంక్షేమ సంఘంలో శనివారం నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. జిల్లా కోర్ కమిటీ సభ్యులు కనిమెని చక్రధర్‌రెడ్డి, బాణాపురం రంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వ రూప, ఉపాధ్యక్షులు ఎగుమామిడి కృష్ణారెడ్డి, గుళ్లపల్లి నర్సింహారెడ్డి, కోశాధికారి ఎడమల హన్మంతరె డ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ భీమా నీలిమారెడ్డి, ఎగ్జి క్యూటీవ్ మెంబర్ మడుపు ప్రేమ్‌సాగర్‌రెడ్డి, ఉప్పు ల లక్ష్మారెడ్డి, ఎడమల భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు అటాచ్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట తహసీల్ ఆఫీస్‌లో పనిచేస్తున్న ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయానికి శనివారం అటాచ్ చేసినట్లు తహసీల్దార్ రామచంద్రం తెలిపారు. తహసీల్ ఆఫీస్‌లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు సంతోష్, గౌతమి అంతర్గత రహస్యాలను ఇతరులకు చేరవేస్తున్నట్లు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కార్యాలయంలో పనిచేసే సిబ్బంది అంతర్గత రహస్యాలను బయటి వ్యక్తులకు చేరవేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా రహస్యాలు చెబుతున్నారని ఇద్దరు అధికారులను ఆర్డీవోకు అటాచ్ చేయడం స్థానికంగా చర్చానీయాంశంగా మారింది. అధికారులకు అనుకూలంగా పనిచేయకపోవడంతోనే ఇబ్బందులకు గురిచేసే క్రమంలోనే ఆర్డీవో ఆఫీస్‌కు అటాచ్ చేసినట్లు ప్రచారంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment