పంటలను కాపాడండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని పంటలు నీరు లేక ఎండిపోతున్నాయని, వెంటనే మల్కపేట నుంచి సాగునీరు అందించాలని గిరిజన రైతులు శనివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు మొరపెట్టుకున్నారు. గుంటపల్లిచెరువుతండా, బాకూర్‌పల్లితండా, దేవునిగుట్టతండా, రాజన్నపేట, అల్మాస్‌పూర్‌లలో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ నీటిని విడుదల చేసి పంటలను కాపాడుతామని హామీ ఇచ్చారు. రాజు, హీర్యా, రాములు, యశ్వంత్, హరిసింగ్, రాంసింగ్, తిరుపతి, నందరాజు, కిషన్, లష్కర్ ఉన్నారు.
20 వరకు పిల్లలకు కంటిపరీక్షలు
సిరిసిల్లకల్చరల్: కంటి చూపు లోపాలున్న బాలబా లికలకు రాష్ట్రీయ బాలస్వస్థ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా మార్చి 20 వరకు పరీక్షలు చేయనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి రజిత తెలిపా రు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం 686 మంది పిల్లలకు నేత్రపరీక్షలు చేశారు. శస్త్రచికిత్స అవసరం ఉంటే సిరిసిల్ల, వేములవాడ ఆస్పత్రుల్లో చేయనున్నట్లు తెలిపారు. ఆర్‌బీఎస్‌కే కోఆర్డినేటర్ డాక్టర్ నహీమ తదితరులు పాల్గొన్నారు.
పంటలను కాపాడండి
Comments
Please login to add a commentAdd a comment