సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనండి
● సరిహద్దు సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తా ● వెంకట్రావుపల్లి గ్రామస్తులతో ఎమ్మెల్యే సత్యనారాయణ
ఇల్లంతకుంట(మానకొండూర్): గ్రామ సరిహద్దు సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామని, గ్రామస్తులు సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు ఇవ్వాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామస్తులతో శనివారం సమావేశమయ్యారు. గ్రామ సరిహద్దులు మార్చారని గ్రామస్తులు ఎమ్మెల్యేకు వివరించారు. తమ గ్రామంలోని పోచమ్మగుడి, బస్టాండు, పాఠశాల, బీరప్ప ఆలయాలను వేరు చేశారని వివరించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే వెంటనే కలెక్టర్‌తో మాట్లాడారు. అధికారులు సర్వేచేసి హద్దులు పరిశీలిస్తారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నవంబర్‌లో ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనని వారికి ఈనెల 16 నుంచి 28వ తేదీ వరకు కు టుంబ వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించిందని వివరించారు. గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మాజీ ఎంపీపీ వెంకటరమణారెడ్డి, గ్రామస్తులు యాదగిరిగౌడ్, నవీన్‌రెడ్డి, మంద రాములు, మంద లింగయ్య, మంద రాజు, బాలయ్య, జనార్దన్‌రె డ్డి, భాగ్యరెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment