● మోసపోయామని గుర్తిస్తే 1930లో ఫిర్యాదు చేయండి ● ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్లక్రైం: సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న సైబర్‌మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్‌మహాజన్ సూచించారు. మోసపోయామని గుర్తిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930లో సంప్రదించాలని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనుమానితుల నుంచి వచ్చే కాల్స్, ఓటీపీలను నమ్మొద్దని సూచించారు. ఇటీవల సిరిసిల్లలో ఒకరు ఫోన్‌లో వచ్చిన లింక్‌ను ఓపెన్ చేయగా రూ.50వేలు పోయాయని, ముస్తాబాద్‌కు చెందిన వ్యక్తి బ్యాంక్ ఖాతా నుంచి రూ.20వేలు కాజేశారని వివరించారు. ఇలాంటి మోసాలపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment