కాంగ్రెస్‌తోనే పట్టభద్రులకు సంక్షేమం
● ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్
సిరిసిల్లటౌన్: గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులపై పదేళ్లుగా బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు సవతిప్రేమ చూపించాయని ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్ విమర్శించారు. కాంగ్రెస్‌తోనే పట్టభద్రుల సంక్షేమం సాధ్యమన్నారు. సిరిసిల్లలోని డీసీసీ ఆఫీస్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఆర్థిక విధ్వంసం సృష్టించిందని ఆరోపించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్, బీజేపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సీఎం రేవంత్‌రెడ్డి 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులకు సంక్షేమం అందుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, రాష్ట్ర నాయకుడు కనిమెని చక్రధర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూప, కాముని వనిత, నేరెళ్ల శ్రీకాంత్, మ్యాన ప్రసాద్, కుడిక్యాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment