
● ‘బీసీ–ఏ’లోకి మార్చేలా ప్రభుత్వం కృషి ● త్వరలోనే పరేడ్
● బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
ఐక్యతతోనే ముదిరాజ్‌లకు రాజ్యాధికారం
ముస్తాబాద్(సిరిసిల్ల): రాష్ట్రంలోని బీసీ కులాలతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్బండ వర్గాలతో కలిసి ఐక్యంగా పనిచేసి ముదిరాజ్‌లు రాజ్యాధికారం సాధించుకోవాలని కాంగ్రెస్ మెదక్ ఇన్‌చార్జి, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ కోరారు. ముస్తాబాద్ మాతృశ్రీ ఫంక్షన్‌హల్‌లో శుక్రవారం నిర్వహించిన ముదిరాజ్‌ల ఆత్మీయ సమావేశానికి హాజరై మాట్లాడారు. కొన్ని పార్టీలు ముదిరాజ్‌లను అవమానించాయని, అలాంటి వారికి ఎన్నికల్లో బుద్ది చెప్పామన్నారు. తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్‌లకు ఇరవై మంది ఎమ్మెల్యేలను గెలిపించుకునే సత్తా ఉందన్నారు. ముదిరాజ్‌లను బీసీ–డీ నుంచి ‘ఏ’లోకి మార్చేందుకు సిద్దిపేట ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని, ముదిరాజ్‌లను బీసీ–ఏలోకి మార్చేందుకు కృషి చేస్తామన్నారు. బీసీ–ఏలోకి మార్చాక సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో భారీ సభ పెడతామన్నారు. ముదిరాజ్ విద్యార్థులను ఉన్నత చదువులకు తీసుకెళ్లేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, మత్స్యకార సొసైటీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రం, బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు పర్శ హన్మాండ్లు, డైరెక్టర్లు గాడిచర్ల దేవయ్య, ముచ్చర్ల శ్రీను, మండలాధ్యక్షుడు పిట్ల రాంగోపాల్, జెల్ల వెంకటస్వామి, గజ్జెల రాజు, మామిండ్ల భూపతి, విఠల్, పిట్టల రవీందర్, పాండు, గొడుగు శంకర్, గీస భిక్షపతి, జాల భిక్షపతి, జింక మల్లేశ్, రంజాన్ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
అసమర్థ కాంగ్రెస్‌పై పోరాడుతాం
సిరిసిల్లటౌన్: రాష్ట్రంలో అసమర్థపాలన సాగిస్తున్న కాంగ్రెస్‌పై పోరాటం చేపడతామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ పేర్కొన్నారు. సిరిసిల్లలో శుక్రవారం నిర్వహించిన జిల్లా కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ఉద్యమ కార్యాచరణ రూపొందించి ముందుకెళ్లాలని జిల్లా నేతలకు సూచించారు. ఏప్రిల్ 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంస్థాగతంగా చేయాల్సిన కార్యక్రమాలపై వివరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చెన్నమనేని వికాస్‌రావు, కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేశ్, కుమ్మరి శంకర్, మ్యాన రాంప్రసాద్, రేగుల మల్లికార్జున్, రవీందర్, దశరథం, రాగుల రాజిరెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, చంటి మహేశ్, కోనేటి సాయిల్, శీలం రాజు, నాగుల శ్రీనివాస్, బర్కం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

● ‘బీసీ–ఏ’లోకి మార్చేలా ప్రభుత్వం కృషి ● త్వరలోనే పరేడ్