
జగ్జీవన్‌రామ్ ఆశయ సాధనకు కృషి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల: బాబు జగ్జీవన్‌రామ్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నామని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం జగ్జీవన్‌రామ్ జయంతిని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి ఎస్పీ మహేశ్ బీ.గీతేతో కలిసి పూలమాలలు వేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూప, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఎస్సీ అభివృద్ధి అధికారి రాజమనోహర్‌రావు, సీపీవో శ్రీనివాసరావు, ఎల్‌డీఎం మల్లికార్జున్, మైనింగ్ ఏడీ క్రాంతి, డీపీవో షరీఫొద్దీన్, డీఎంహెచ్‌వో రజిత పాల్గొన్నారు.
జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయం
– ఎస్పీ మహేశ్ బీ.గీతే
సిరిసిల్లక్రైం: జగ్జీవన్‌రామ్ గొప్ప సంఘసంస్కర్త అని ఎస్పీ మహేశ్ బీ.గీతే కొనియాడారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సర్దాపూర్‌లోని 17వ బెటాలియన్‌లో జగ్జీవన్‌రామ్ జయంతి నిర్వహించారు. ఆర్‌ఐ అడ్మిన్ రమేశ్, ఆర్‌ఎస్సై సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.