
సన్నబియ్యం ఇస్తోంది కేంద్రం ప్రభుత్వమే..
● బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్
రుద్రంగి(వేములవాడ): కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమవిగా చెప్పుకోవడం సిగ్గుచేటు బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నంద్యాడపు వెంకటేశ్ విమర్శించారు. రుద్రంగి మండల కేంద్రంలోని రేషన్‌షాపులో శనివారం పీఎం మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి రేషన్‌బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వెంకటేశ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి ప్రతీ నెల ఆరు కిలోల బియ్యం ఇస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా హామీలను విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు పడాల గణేశ్, బోయిని రాజు, మీసాల రవీందర్, పెద్ది శ్రావణ్, అల్లూరి రవీందర్‌రెడ్డి, పడాల గజానంద్, అక్కెనపెల్లి నర్సింగరావు, తాళ్లపల్లి బాలకిషన్‌రావు, మంచె వసంత్, బొబ్బిలి గణేశ్, బలగం శ్రీధర్ పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరోగ్య పరీక్షలు
● జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత
సిరిసిల్ల: అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో శనివారం వైద్యాధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలతో ఈనెల 7 నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు ఆప్తాలమిక్ ద్వారా కంటి పరీక్షలు చేస్తామని వివరించారు. స్మార్ట్‌చెక్– 42 ద్వారా పిల్లల్లో పెరుగుదల లోపాలను గుర్తించి, వైద్యం చేయించాలని సూచించారు. డీఐవో డాక్టర్ సంపత్‌కుమార్, ఆర్‌బీఎస్‌కే కో ఆర్డినేటర్ డాక్టర్ నయీమ్ జహా, వైద్యులు, ఫార్మసిస్టులు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
బీజేపీది ప్రజా వ్యతిరేక విధానం
● సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు
సిరిసిల్లటౌన్: దేశంలో బీజేపీ సర్కారు ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు విమర్శించారు. సిరిసిల్లలోని కార్మికభవన్‌లో శనివారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడారు. సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈనెల 9, 10వ తేదీల్లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా, దేశవ్యాప్తంగా ఆదివాసీలు దళితులపైన దాడులకు నిరసనగా, దేశ ప్రజల యొక్క వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టపెట్టే విధానాలను ఎండగడుతామన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మంద సుదర్శన్, మీసం లక్ష్మణ్, లక్ష్మారెడ్డి, చంద్రం, బాలరాజు పాల్గొన్నారు.
ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
● బీజేపీ ఆవిర్భావ దినోత్సవ కమిటీ కన్వీనర్ శ్రీనివాస్
చందుర్తి(వేములవాడ): ఆవిర్భావ వేడుకలను ఆదివారం అన్ని గ్రామాల్లో నిర్వహించాలని బీజేపీ ఆవిర్భావ దినోత్సవ కమిటీ కన్వీనర్ సిరికొండ శ్రీనివాస్ కోరారు. మండల కేంద్రంలో శనివారం కార్యకర్తలు, నాయకులకు పార్టీ జెండాలను పంపిణీ చేసి మాట్లాడారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతీ కార్యకర్త తమ ఇంటిపై పార్టీ జెండాను ఎగురవేయాలని కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు మొకిలే విజేందర్, నాయకులు సిర్రం తిరుపతి, అంబాల శ్రీకాంత్, పెరుక గంగరాజు, పత్తిపాక శ్రీనివాస్ పాల్గొన్నారు.

సన్నబియ్యం ఇస్తోంది కేంద్రం ప్రభుత్వమే..

సన్నబియ్యం ఇస్తోంది కేంద్రం ప్రభుత్వమే..

సన్నబియ్యం ఇస్తోంది కేంద్రం ప్రభుత్వమే..