
‘సుస్థిరం’.. గండ్రపల్లి గ్రామం
జమ్మికుంట: రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనలో జిల్లాలోని జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామపంచాయతీ పని తీరు సుస్థిరంగా నిలిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల బృందాలు సందర్శించి నివేదికలు అందజేశాయి. ఫలితంగా సుస్థిర గ్రామ అభివృద్ధి లక్ష్య సాధనలో అత్యంత ప్రతిభ కనబరిచిన గండ్రపల్లి జిల్లాలో రెండవదిగా నిలి చింది. రాష్ట్రంలో 11వ స్థానంలో 80.19 శాతం మార్కులు దక్కించుకుంది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ గణాంకాల్లో రాష్ట్రంలోని 25 పంచాయతీల్లో ప్రత్యేక స్థానం సాధించింది.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు
పేదరికం లేని వ్యవస్థ నిర్మాణం, ఆహార భద్రత్ర, పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యం, ఆరోగ్యం, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం, ఆర్థిక అభివృద్ధి, అసమానతలు తగ్గించడం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి కృషి చేశారు. 2022–23, 2023–24 సంవత్సరంలో విధులు నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి ఝాన్సి జిల్లా అధికారుల అభినందనలు, శుభాకాంక్షలు పొందారు.
నిధుల సద్వినియోగం
గండ్రపల్లిలో 2022–23, 2023–24 సంవత్సరంలో సుస్థిరమైన అభివృద్ధికి గ్రామ పంచాయతీ అధికారి, సర్పంచ్, పాలక వర్గంతోపాటు గ్రామస్తుల సహకారం ఎంతో కీలకంగా పని చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సమర్థవంతంగా ప్రజలకు చేరేలా కృషి చేశారు.
గండ్రపల్లి వివరాలు..
గ్రామ జనాభా 1,566
గృహాలు 476
పురుషులు 796
మహిళలు 770
తాగునీటి కనెక్షన్లు 469
రేషన్‌కార్డులు 476
పెన్షన్‌దారులు 219
ఉపాధి జాబ్‌కార్డులు 501
ఎస్‌హెచ్‌జీ గృహాలు 26
బ్యాంక్ లోన్ తీసుకున్న సంఘాలు 14
గ్యాస్ కనెక్షన్లు 459
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు సద్వినియోగం
అత్యుత్తమ ప్రతిభతో 80.19శాతం మార్కులు
కేంద్ర, రాష్ట్ర బృందాల సందర్శన, నివేదికలు
లక్ష్యం దిశగా కృషి
ప్రభుత్వ నిధులు, సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకొని, ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తాం. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సహాయ సహకారాలతో వంద శాతం సుస్థిర అభివృద్ధి లక్ష్యం దిశగా కృషి చేస్తూ ముందుకు సాగుతాం.
– వెంగల రాములు, పంచాయతీ
కార్యదర్శి, గండ్రపల్లి
నిధులు సద్వినియోగం
ప్రభుత్వ నిధులు సద్వినియోగం చేసుకొని గ్రామ అభివృద్ధికి కృషి చేశాం. రానున్న రోజుల్లో వందశాతం మెరుగైన అభివృద్ధికి సహకారం అందిస్తాం.
– బల్మూరి పద్మసమ్మారావు,
మాజీ సర్పంచ్, గండ్రపల్లి

‘సుస్థిరం’.. గండ్రపల్లి గ్రామం

‘సుస్థిరం’.. గండ్రపల్లి గ్రామం

‘సుస్థిరం’.. గండ్రపల్లి గ్రామం