కూరగాయల సాగు..ఉపాధి బాగు | - | Sakshi
Sakshi News home page

కూరగాయల సాగు..ఉపాధి బాగు

Published Sat, Apr 12 2025 2:52 AM | Last Updated on Sat, Apr 12 2025 2:54 AM

● తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి ● ఉపాధి పొందుతున్న పలు కుటుంబాలు

ఇల్లంతకుంట(మానకొండూర్‌): మెట్టప్రాంత రైతులు కూరగాయల సాగుతో ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. తక్కువ నీటితో చేతికొచ్చే కూరగాయలు సాగుచేస్తూ ఆర్థిక కష్టాల నుంచి బయటపడుతున్నారు. ఇల్లంతకుంట మండలంలోని రామాజీపేట, ముస్కానిపేట, రహీంఖాన్‌పేట, వల్లంపట్ల, గాలిపల్లి గ్రామాలు కూరగాయల సాగుకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయి. ఆయా గ్రామాల్లో కూరగాయలు సాగుచేస్తూ పిల్లలను ఉన్నతంగా చదివించిన కుటుంబాలు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కూరగాయల సాగుపై స్పెషల్‌ స్టోరీ.

సంప్రదాయ పంటలకు భిన్నంగా..

ఇల్లంతకుంట మండలంలోని అత్యధిక మంది రైతులు సంప్రదాయ పంటలైన వరి, పత్తి కాకుండా కూరగాయలు, మొక్కజొన్న పంటలు సాగుచేస్తున్నారు. మండలంలోని నీటి ఎద్దడిని తట్టుకునేందుకు కూరగాయలు సాగుచేస్తున్నారు. మండల వ్యాప్తంగా ఈ వేసవిలోనూ దాదాపు 200 ఎకరాలలో దాదాపు 60 కుటుంబాలు కూరగాయలు సాగు చేస్తున్నాయి. తమ తోటలో వస్తున్న కూరగాయలను సిరిసిల్ల, సిద్దిపేట పట్టణాలకు వెళ్లి రైతుబజార్‌లలో విక్రయిస్తున్నారు. మరికొందరు రైతులు మండలంలోని పలు గ్రామాలకు ద్విచక్రవాహనాలపై వెళ్లి విక్రయిస్తున్నారు. ఇలా తమ కుటుంబాలను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కిస్తున్నారు.

ఇతను ఇల్లంతకుంట మండలం రామాజీపేటకు చెందిన చొప్పరి కరుణాకర్‌. ఏటా మూడెకరాలలో బీర, సోరకాయ, టమాట, కాకరకాయలు సాగు చేస్తుంటాడు. సంవత్సరం పొడవునా కూరగాయలు పండేలా ప్రణాళిక చేసుకుంటాడు. దీంతో సంవత్సరం పొడగునా కూరగాయలు అమ్ముతూ ఆదాయం పొందుతున్నాడు. తోట వద్ద సంపు నిర్మించుకొని.. బోరునీటిని నింపి తోటను పారిస్తుంటాడు. ఇలా ఏడాది పొడవునా కూరగాయల సాగుతో రూ.3లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడు.

కూరగాయల వ్యాపారమే అండ

మా అమ్మ కూరగాయలు అమ్మింది. అమ్మ స్ఫూర్తితోనే నేను కూడా కూరగాయలు అమ్ముతున్నాను. ఓమ్ని వాహనంలో సిరిసిల్ల మార్కెట్‌ నుంచి కూరగాయలు తెచ్చి ఇల్లంతకుంట మార్కెట్లో విక్రయిస్తున్నాం. మా జీవనం గడుస్తుంది. ఇల్లు కూడా కట్టుకున్నాను. పిల్లలను చదివించాను. మా కూతురు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అబ్బాయి హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నాడు.

– సింగిరెడ్డి రాజిరెడ్డి దంపతులు

తోపుడు బండిపైనే విక్రయిస్తాను

తోపుడు బండిపై ఇల్లంతకుంటలోని వీధుల్లో నిత్యం తిరుగుతూ కూరగాయలు అమ్ముతాను. మండలవ్యాప్తంగా జరిగే వారసంతల్లోనూ మధ్యాహ్నం కూరగాయలు విక్రయిస్తాను. కొన్ని సమయాల్లో కూరగాయలు మురిగిపోయి నష్టం కూడా జరుగుతుంది. మా కుటుంబానికి ఇదే జీవనోపాధి. – తడిక రాజయ్య, వ్యాపారి

కూరగాయల సాగు..ఉపాధి బాగు1
1/3

కూరగాయల సాగు..ఉపాధి బాగు

కూరగాయల సాగు..ఉపాధి బాగు2
2/3

కూరగాయల సాగు..ఉపాధి బాగు

కూరగాయల సాగు..ఉపాధి బాగు3
3/3

కూరగాయల సాగు..ఉపాధి బాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement