రంగారెడ్డి: ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీసుకానిస్టేబుల్ ఉద్యోగాల్లో మారుమూల ప్రాంత మైన మంచాల మండలం నుంచి 76 మంది ఉద్యోగాలు సాధించారు. వీరిలో చాలామంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. ఒక్క మంచాల గ్రామం నుంచే 17 మంది ఎంపిక కావడం విశేషం. ఆరుట్ల పంచాయతీ పరిధిలో 11 మంది ఉద్యో గాలు సాధించారు.
అన్నదమ్ములు పృథ్వీధర్‌రెడ్డి, శరత్‌చంద్రారెడ్డిని సత్కరించిన కౌన్సిలర్ చల్లూరి మురళీధర్‌రెడ్డి
ఆగాపల్లి నుంచి నలుగురు, బండలేమూర్ నుంచి నలుగురు, అజ్జిన తండా నుంచి ఇద్దరు, చెన్నారెడ్డిగూడ నుంచి ఇద్దరు, లోయపల్లి నుంచి నలుగురు, ఎల్లమ్మ తండా నుంచి ముగ్గురు, బోడకొండ నుంచి ఐదుగురు ఉన్నారు. సత్తి తండా నుంచి ఇద్దరు, కొర్రం తండా నుంచి ఇద్దరు, చీదేడ్ నుంచి ముగ్గురు, రంగాపూర్ నుంచి ముగ్గురు, వెంకటేశ్వర తండా నుంచి ఒకరు చొప్పున ఎంపికయ్యారు. లింగంపల్లి నుంచి ఒకరు, నోముల నుంచి ఇద్దరు, తిప్పాయిగూడ నుంచి ముగ్గురు, తాళ్లపల్లి గూడ నుంచి నలుగురు, చిత్తాపూర్ నుంచి ముగ్గురు చొప్పున ఉన్నారు.
అన్నదమ్ముల ఎంపిక
అబ్దుల్లాపూర్‌మెట్: పెద్దఅంబర్‌పేట పురపాలక సంఘం 9వ వార్డుకు చెందిన కర్తాల కృష్ణారెడ్డి, సుజాత దంపతుల ఇద్దరు కుమారులు పృథ్వీధర్‌రెడ్డి, శరత్ చంద్రారెడ్డి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. స్థానిక వార్డు కౌన్సిలర్ చల్లూరి మురళీధర్‌రెడ్డి శుక్రవారం వారిని అభినందించి సత్కరించారు.
సంతోషంగా ఉంది
మాది మధ్యతరగతి కుటు ంబం. కష్టపడి చదివాను. పోలీసు ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది. పట్టుదలతో మరింత కష్టపడి ఉద్యోగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటాను.
– చెనమోని సందీప్, మంచాల, ఏఆర్ కానిస్టేబుల్
కష్టానికి ఫలితం
మాది నిరుపేద కుటుంబం.రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. కష్టపడి చదివాను. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాను. చాలా ఆనందంగా ఉంది.
– కుండె పల్లవి, మంచాల, సివిల్ కానిస్టేబుల్
Comments
Please login to add a commentAdd a comment