రెడీ | - | Sakshi
Sakshi News home page

రెడీ

Published Sun, Feb 16 2025 7:25 AM | Last Updated on Sun, Feb 16 2025 7:25 AM

రెడీ

రెడీ

రేసుకు
గుర్రపు స్వారీ.. చూసొద్దామా మరి
● ఈక్వెస్ట్రియన్‌ చాంపియన్‌ షిప్‌–2025కు అంతా సిద్ధం ● వేదిక కానున్న శంకర్‌పల్లి మండలం జన్వాడ ● అతిథ్యమివ్వనున్న నాసర్‌ పోలో హార్స్‌ రైడింగ్‌ క్లబ్‌ ● దేశం నలుమూలల నుంచి పాల్గొననున్న హార్స్‌ రైడర్లు

పోలో: సిలికా ఎరినా (గ్రౌండ్‌)లో నిర్వహిస్తారు. ఈ విభాగంలో మొత్తం రెండు జట్లు పోటీ పడతాయి. ఒక్కో జట్టులో ముగ్గురు రైడర్లు ఉంటారు. ఒక్కో గేమ్‌ 7 నిమిషాల పాటు సాగుతుంది. మూడున్నర నిమిషాలకోసారి విరామం ఇస్తారు.

షో జంపింగ్‌: మట్టి కోర్టులో నిర్వహిస్తారు. ఈ విభాగంలో ఒక్కో రైడర్‌ మాత్రమే పోటీ పడతారు. 5 నిమిషాల పాటు సాగే ఈ గేమ్‌లో.. రెండున్నర నిమిషాలకు విరామం ఇస్తారు. హార్డిల్స్‌ని 60 సెం.మీ, 80 సెం.మీ, 100 సెం.మీ, 110 సెం.మీ ఎత్తులో ఉంచి, వాటి పై నుంచి గుర్రాలు జంప్‌ చేసేలా పోటీలు ఉంటాయి.

డ్రెసాజ్‌: మట్టి కోర్టులోనే నిర్వహిస్తారు. మార్చ్‌ ఫాస్ట్‌, గుర్రం, రైడర్ల నైపుణ్యం, కచ్చితత్వం వంటి వాటిపై పోటీ ఉంటుంది. ఈ గేమ్‌ 5 నిమిషాల పాటు సాగుతుంది. రెండున్నర నిమిషాలకు విరామం ఇస్తారు.

న్వాడలోని నాసర్‌ పోలో హార్స్‌ రైడింగ్‌ క్లబ్‌ని 1988లో హైదరాబాద్‌ నవాబ్‌లకు చెందిన మీర్‌ అహ్మద్‌ ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. మీర్‌ అహ్మద్‌ 60 ఏళ్ల క్రితమే ఖైరతాబా ద్‌లో బాలికల, గచ్చిబౌలిలో బాలుర పాఠశాలలను ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించి, విద్యార్థులకు శిక్షణ ఇచ్చి పోటీలకు పంపాలన్న ఉద్దేశంతో నాసర్‌ పోలో హార్స్‌ రైడింగ్‌ క్లబ్‌కు శ్రీకారం చుట్టారు. క్లబ్‌లో దాదాపు 40కి పైగా శిక్షణ పొందిన గుర్రాలు, నిష్ణాతులైన కోచ్‌లను ఏర్పాటు చేశారు. పోలో కోసం ప్రత్యేకంగా సిలికా ఎరినా (గ్రౌండ్‌) అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారు. రాత్రి సమయంలోనూ శిక్షణ పొందేందుకు ఫ్లడ్‌ లైటింగ్‌ సిస్టం సైతం ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా ఆరు క్లబ్‌లు ఉండగా జన్వాడలోని క్లబ్‌ ఒకటి కావడం విశేషం.

ఈనెల 22,23 తేదీల్లో అర్హత పోటీలు

జూనియర్‌ నేషనల్‌ ఈక్వెస్ట్రియన్‌ చాంపియన్‌షిప్‌– 2025 పోటీల కోసం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జన్వాడలోని నాసర్‌ పోలో హార్స్‌ రైడింగ్‌ క్లబ్‌లో ఈ నెల 22,23 తేదీల్లో జాతీయ అర్హత పోటీలు నిర్వహించనున్నారు. దేశంలో గుర్తింపు పొందిన హార్స్‌ రైడింగ్‌ క్లబ్బుల నుంచి అండర్‌ –11, అండర్‌–14, అండర్‌–18 కేటగిరీల్లో ఉన్న హార్స్‌ రైడర్స్‌ మాత్రమే పాల్గొంటారు. పోటీలకు వచ్చే రైడర్లు, అతిథుల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో రైడర్‌ ఒక్కోసారి మాత్రమే (నాకౌట్‌) పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది. అర్హత పోటీల్లో గెలుపొందిన విజేతలు ఢిల్లీలో నిర్వహించే చాంపియన్‌షిప్‌ –2025 ఫైనల్స్‌లో తలపడతారు. ఈక్వెస్ట్రియన్‌లో మొత్తం మూడు విభాగాలు (పోలో, షో జంపింగ్‌, డ్రెసాజ్‌) ఉంటాయి.

గుర్రాలు లేనివాళ్లకు రెంటుకు

జాతీయ అర్హత పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హార్స్‌ రైడర్లు వచ్చే అవకాశం ఉంది. కొందరు తమ సొంత గుర్రాలను తెచ్చుకోవడంలో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం తమ వద్ద ఉన్న గుర్రాలను రోజుకు రూ.1000 అద్దె చెల్లించి, పోటీలకు వినియోగించుకోవచ్చని నాసర్‌ పోలో నిర్వాహకులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే గుర్రాలకు ప్రత్యేకమైన స్థలాన్ని ‘స్టేబుల్‌’ అనే పేరుతో

షో జంపింగ్‌, డ్రెసాజ్‌ల కోసం సిద్ధం చేసిన మట్టి కోర్టు

ప్రవేశం ఉచితం

జన్వాడలోని నాసర్‌ పోలో హార్స్‌ రైడింగ్‌ క్లబ్‌లో నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పోటీలు చూసేందుకు అభిమానులకు ఫ్రీ ఎంట్రీ అవకాశం కల్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రెడీ1
1/1

రెడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement