కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు
మహేశ్వరం: కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు తప్పకుండా ఉంటుందని రోడ్డు రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు. ఘట్టుపల్లి శివారులోని కోరుపోలు చంద్రారెడ్డి రిసార్ట్స్‌లో యూత్ కాంగ్రెస్ నాయకులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం సోమవారం రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఓపిక, నిబద్ధత, క్రమశిక్షణ, సమన్వయంతో పని చేసే నాయకులకు పార్టీ, నామినేటెడ్ పదవులు వరిస్తాయన్నారు. ప్రతి యూత్ కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతం చేయాలన్నారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యే, నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని ఆయన సూచించారు. రాబోయే కాలం యూత్ కాంగ్రెస్‌దే అన్నారు. అంతకు ముందు జాతీయ యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జి శ్రీకృష్ణ అల్లవారు, అధ్యక్షుడు ఉదయ్‌భాను ఛిబ్ ‘చలో పంచాయతీ వార్డు 2025, నా ఓటు–నా బాధ్యత’ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివ సేనరెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, కాంగ్రెస్ పార్టీ సినీయర్ నాయకులు కోరుపోలు రఘుమారెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, రాకేష్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మంత్రి పొన్నం ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment