కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
దిల్‌సుఖ్‌నగర్: ఆర్‌కేపురం డివిజన్‌లోని కుర్తాళ పీఠం శ్రీ ప్రత్యంగిరా దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుర్తాళ పీఠ ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ మాచవోలు రమేష్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవార పసుపు కుంకుమ అలంకరణలో దర్శనమిచ్చారు. దేవాలయ ప్రాంగణంలో మహిళల సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. పూజల్లో మునిపల్లె శ్రీనివాస్, మునిపల్లె సువర్ణ లత, విఠల్ శర్మ, హేమంత్ శర్మ, శ్రీపతి, అన్నపూర్ణ, హేమ, దేవి, హిమబిందు పాల్గొన్నారు.
నేడు అన్నాభిషేకం..
దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యంగిరా అమ్మావారికి అన్నాభిషేకం, పల్లకి సేవ నిర్వహిస్తున్నట్లు ఆలయ సెక్రటరీ మునిపల్లె శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment