చాక్లెట్లు పంచితే హెచ్‌ఎంను సస్పెండ్ చేస్తారా?
హస్తినాపురం: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా నందనవనం కాలనీలో రోడ్డుపై కేక్‌కట్ చేసి కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటి విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేస్తే ఆ పాఠశాల హెచ్‌ఎంను సస్పెండ్ చేయడం ఎంత వరకు సమంజసమని హస్తినాపురం డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆండోజు సత్యంచారి, మాజీ కార్పొరేటర్ రమావత్ పద్మానాయక్ ప్రశ్నించారు. మంగళవారం హస్తినాపురం డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ రోడ్డులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ బానోతు సుజాతానాయక్ వ్యక్తిగతంగా చాలా మంచివారని ఆమె పీఏ చంద్రశేఖర్‌రెడ్డి కావాలని డివిజన్‌లో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకులు నారగోని శ్రీనివాస్‌యాదవ్, మాజీ అధ్యక్షుడు గోదల రఘుమారెడ్డి, సయ్యద్, రమావత్ శ్రీనివాస్‌నాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment